ఉదయ్ కిరణ్ చివరి లేఖలో ఏముంది.. చదివితే కన్నీరు ఆగదు..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన నటన టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొద్ది కాలానికి స్టార్ హీరోగా ఎదిగారు లవర్ బాయ్ ఉదయ్ కిరణ్. ఆయన ఎంత స్పీడుగా పేరు సంపాదించుకున్నారో అంతే స్పీడ్ గా డల్ అయిపోయారు. చివరికి విగతాజీవిగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.. ఆయనకు అంతటి గతి రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన రాసినటువంటి చివరి లేక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి, వరుసగా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి అప్పట్లో ఉన్న స్టార్ హీరోలకు దీటుగా నిలిచారు. ఆయన జీవితంలో వచ్చిన కొన్ని చిన్న చిన్న సంఘటనల వల్ల సినిమా అవకాశాలు తగ్గిపోయి ఎన్నో కష్టాలు పడ్డాడు. వ్యక్తిగత పరిస్థితుల కారణంగా జనవరి 5, 2014 రోజున ఆత్మహత్య చేసుకొని పరమపదించాడు. తాజాగా ఆయన రాసినటువంటి చివరి లేక బయటకు వచ్చింది. ఆ లేఖలో ఏముందయ్యా అంటే.. “విషిత నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో,ఆ తర్వాత అంతటి స్థాయి నీకు ఇచ్చాను. మా అమ్మని ఏ విధంగా నేను ప్రేమించానో,అదేవిధంగా నిన్ను కూడా ప్రేమించానని, మన మధ్య గొడవల కారణంగా, అంకుల్ ఆంటీ చాలా బాధలు పడుతున్నారు.

వారికి ఈ బాధలు ఉండకూడదు. నువ్వు ఆయన మంచివాడు అని నమ్ముతున్నావు కానీ, ఆ వ్యక్తి మంచివాడు కాదు. నా మాట విను.. నీకు అన్ని నిజాలు తెలిసే రోజున ఉదయ్ నీ పక్కన ఉండడు.. నువ్వు అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో అంటూ.. చాలా ఎమోషనల్ గా తన చేతిరాతతోనే ఈ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియా వేదిక వైరల్ గా మారింది. ఇది చదివినటువంటి నెటిజన్స్ ఒకింత కన్నీరు పెట్టుకుంటూ వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి..

ఉదయ్ కిరణ్ చివరి లేఖలో ఏముంది.. చదివితే కన్నీరు ఆగదు..!!