సాధారణంగా చాలామంది వారి యొక్క జాతకాన్ని చూయించుకొని ఉంగరాలు, వజ్రాలు వంటివి ధరిస్తారు. వాటీ ద్వారా నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అందరూ వజ్రాలని ధరిస్తే మంచి జరగదు కొంతమందికి మాత్రమే వజ్రాలు ధరిస్తే మంచి జరుగుతుంది. మరి కొంతమందికి హాని జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
వజ్రాలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఎన్ని నగలు ధరించినా సరే వజ్రం అనేది ఒకటి వేసుకుంటే అందులో ఉండే ఆనందం వేరు. అయితే ఎవరి స్థాయికి తగ్గట్టు వారు వజ్రాలను కొనుక్కుంటూ ఉంటారు. ఈ డైమండ్లను వాడితే ఎవరికి మేలు కలుగుతుంది, ఎవరికి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి : అంగారకుడిచే పాలించబడే ఈ రాశి వారు వజ్రాలు ధరించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి..
వృషభ రాశి : వృషభం పాలించే శుక్ర గ్రహం . వీరు వీనస్ డైమండ్ ఎప్పుడూ వాడటం వల్ల సంతోషంగా ఉంటారు. దీనివల్ల వీరికి ఆర్థిక సమస్యలు తొలిగిపోయి ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.
మీనరాశి: మీన రాశి వారి జాతకంలో శుక్రుడు మూడవ ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ధరించవచ్చు. ఈ స్థానంలో ఉండడం చాలా అరుదుగా కనబడుతుంది. కాబట్టి వీరు వజ్రాలు ధరించడం అంత శ్రేయస్కారం కాదని నిపుణులు అంటున్నారు.
తులారాశి : తులారాశి కి చెందినవారు వజ్రాన్ని చాలా సులభంగా ధరించవచ్చు. ఈ రాశి వారు వజ్రాన్ని ధరించడం వల్ల రాహుకేతు శని దుష్ఫలితాలు నశిస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
కన్యా రాశి : కన్య రాశి వారు వజ్రాలు ధరించడం వల్ల బాగా కలిసి వస్తుంది. శుక్రుడు అతని జాతకంలో రెండు,తొమ్మిది స్థానం లో ఉండటంవల్ల వజ్రాలు ధరించడం వారికి ఉత్తమమైన ఫలితాలు ఇస్తుందట.