తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ సుమ అంటే ఒక సంచలనం. బుల్లితెర యాంకర్లలో అందరికంటే స్టార్ ఇమేజ్ తెచ్చుకొని ఒక మహారాణిలా వెలుగుతోంది. సుమ యాంకర్ గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది . ఈమె మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు భాషలో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. యాంకరింగ్ రంగంలో సుమని దాట వేయడం ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు. సుమ కనకాల దాదాపు రెండు దశాబ్దాల పాటు బుల్లితెరని యాంకర్ గా ఏలుతుంది.
తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్ ఎవరు అంటే ఇంకో పది సంవత్సరాలు అయినా సుమ పేరే చెప్పుకునేలా తన క్రేజ్ సంపాదించుకుంది. ఇక సుమా వ్యక్తిగత విషయంలోకి వస్తే..రాజీవ్ కనకాల ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే సుమ తన ఇన్నేళ్ల సినీ కెరియర్ లో చాలానే డబ్బులు వెనకేసింది. అలాగే తన ఒక్కో ఈవెంట్ కి దాదాపు 5 లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. సుమ టీవీ షోలు, ఆడియో ఫంక్షన్ లు మిగతా ఇంటర్వ్యూలు అన్నీ కలిపి దాదాపు నెలకి 50 లక్షలు నుండి 80 లక్షల వరకు సంపాదిస్తుందట.
సుమ దగ్గర టయోటా కార్ అలాగే స్కోడా న్యూ రాబిట్ కార్ కూడా ఉంది. సుమకి మణికొండలో చాలా విలాసవంతమైన ఇల్లు, అలాగే అత్తమామలు సంపాదించిన ఇల్లు కూడా ఉంది. ఇక ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలుగా సుమ సంపాదించిన ఆస్తి సుమారుగా 40 కోట్ల రూపాయల వరకు ఉంటుందని టాలీవుడ్ ఇన్సైడ్ టాక్. కేవలం డబ్బులు సంపాదించడమే కాదు చాలామంది పేదలకు దానధర్మాలు కూడా చేస్తుంది సుమకనకాల. సుమ కేరళలో వరదలు వచ్చినప్పుడు దాదాపు 8 లక్షల వరకు సహాయం అందించిందట.
యాంకర్ సుమ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు తెలిస్తే షాకవుతారు..?