Vallabhaneni janardan:నటుడు జనార్ధన్ కు ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయని మీకు తెలుసా..?

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు , సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, తాజాగా సీనియర్ నటుడు, దర్శక నిర్మాత వల్లభనేని జనార్ధన్ కన్నుమూశారు.. 2022లో ఇండస్ట్రీ చాలామంది సీనియర్ నటులను కోల్పోయింది. వల్లభనేని జనార్ధన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో గురువారం మరణించారు. జనార్ధన్ ఏలూరు సమీప ప్రాంతమైన పోతునూరులో 1959 సెప్టెంబర్ 25న జన్మించారు. అతనికి ఇద్దరు కూతుర్లు,ఒక కొడుకు. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో ఉంటాడు. జనార్ధన్ కు సినిమాలపై ఉన్న ఆసక్తి వల్ల కెరియర్ బిగినింగ్ లోనే సొంత బ్యానర్ స్థాపించి మా అమ్మగారి మనవలు అనే చిత్రాన్ని స్టార్ట్ చేశాడు.

కానీ ఈ మూవీ మధ్యలోనే ఆగింది. ఆ తర్వాత కన్నడ హిట్ మూవీ మానస సరోవర్ ఆధారంగా చంద్రమోహన్ హీరోగా అమాయక చక్రవర్తి మూవీకి దర్శకత్వం వహించారు. దీని తర్వాత శోభన్ బాబు హీరోగా హిందీ బెరాస మూవీని తెలుగులో తోడు నీడగా రీమేక్ చేశాడు. తన మామ విజయ బాపినీడు కలిసి మహా జనానికి మరదలు పిల్ల అనే మూవీని తెరకెక్కించారు. అంతేకాకుండా విజయ బాపినీడు డైరెక్షన్లో వచ్చిన అనేక సినిమాల్లో జనార్ధన్ నటుడిగా చేశారు. చిరంజీవి సూపర్ హిట్ చిత్రం “గ్యాంగ్ లీడర్” సినిమాలో సుమలత తండ్రి, ఎస్పీగా నెగిటివ్ పాత్రలో మెప్పించారు.

120 కి పైగా చిత్రాల్లో నటించిన జనార్ధన్ చాలానే సంపాదించారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనార్ధన్ తాతగారు టాప్ 5 బిజినెస్ మ్యాన్ లలో ఒకరు. ఆయన ఆస్తిలో భాగంగా ఈయనకు అప్పుడే 400 కోట్లకు పైగా వాటా వచ్చిందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈయన కూడా బిజినెస్, సినిమాల ద్వారా చాలా ఆస్తులు కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ దాదాపుగా 1400 కోట్లకు పైగానే ఉంటుంద ని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జనార్ధన్ ఇండస్ట్రీని వీడి వెళ్లడం బాధాకరం.

Vallabhaneni janardan:నటుడు జనార్ధన్ కు ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయని మీకు తెలుసా..?