Ts Congress: రేవంత్ రెడ్డికి షాక్..మరో కీలక నేత రాజీనామా..!!

కాంగ్రెస్ సముద్రం లాంటి పార్టీ అని చెప్పుకొని తిరగడం తప్ప నాయకుల మధ్య అసలు సఖ్యత కుదరడం లేదు. పదవుల కోసం సముద్రం లాంటి పార్టీని చీలుస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీలో ఇదే తంతు కొనసాగుతోంది.. దీంతో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో అసమర్థత ఏర్పడుతోంది. తెలంగాణ విషయానికొస్తే రేవంత్ రెడ్డి అధ్యక్షులు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది.. కానీ సీనియర్ నాయకుల పోరు మాత్రం తప్పడం లేదు.. రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం ఎంత ముందుకు వెళ్లిన, కొంతమంది నాయకుల వల్ల అది నీరుగారి పోతోంది.

ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరు పార్టీని వీడారు.. మరొకరు పార్టీకి దూరంగానే ఉంటున్నారు.. ఇది ఒక పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు.. ఇది మరవక ముందే మరో పంచాయతీ మొదలైంది.. రెండు రోజుల కింద రిలీజ్ చేసిన కొత్త కమిటీలో తమకు అన్యాయం జరిగిందంటూ కొంతమంది అసంతృప్తిలో ఉన్నారు.. దీంతో టిపిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా కూడా చేశారు. పదవులు ముఖ్యం కాదు కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు.. ఈ తరుణంలోనే మరో నేత ఇదే బాట పట్టాడు..

కొత్త కమిటీ ఏర్పాటుపై అసంతృప్తిని వెళ్లగక్కుతూ తన అధికార ప్రతినిధి పదవికి బెల్లయ్య నాయక్ రాజీనామా చేశారు.. తీవ్ర అన్యాయం జరిగిందని ఎస్టీలకు చోటు కల్పించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.. రెండు రోజుల క్రితం ఏఐసీసీ 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ, 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, 26 జిల్లాలకు నూతన అధ్యక్షుల బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.. దీనిపై ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చ కొనసాగుతోంది.. మరి ఈ రచ్చ చివరికి ఎక్కడికి చేరుతుందో వేచి చూడాల్సిందే..

Ts Congress: రేవంత్ రెడ్డికి షాక్..మరో కీలక నేత రాజీనామా..!!

Ts Congress: రేవంత్ రెడ్డికి షాక్..మరో కీలక నేత రాజీనామా..!!