TRS అవుట్.. BRS ఇన్.. కలిసొస్తుందా..?

గత కొంతకాలంగా కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టి చివరికి టిఆర్ఎస్ పార్టీని దేశ పార్టీగా రూపుదిద్దారు. ఈ తరుణంలో గులాబీ నేతలకు ఎన్నికల సంఘం తీపి కబురు అందించింది.. టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ ఆమోదం చేసింది.. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత్ రాష్ట్ర సమితిగా ఏర్పడిందన్నమాట.. ఈ తరుణంలో ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్ కు అధికారికంగా ఒక లేఖ అందించింది..

దీంతో సీఎం కేసీఆర్ 9 డిసెంబర్ 2022 శుక్రవారం రోజు మధ్యాహ్నం1.20 నిమిషాలకు దివ్యమైన ముహూర్తంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించి జెండా ఎగరవేశారు.. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో తనకు వచ్చిన అధికారిక లేఖను రిప్లై గా సంతకం చేసి మళ్లీ ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు ఇతర నాయకులు పాల్గొన్నారు.. ఏది ఏమైనా టిఆర్ఎస్ ఆలోచనకు మొదటి అడుగు పడింది.

ముందు ముందు దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియదు కానీ, కేసీఆర్ అభిమానులంతా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటూ కాబోయే పీఎం కెసిఆర్ అంటూ సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

TRS అవుట్.. BRS ఇన్.. కలిసొస్తుందా..?