అతి టెక్నాలజీ వల్ల సృష్టికే ముప్పు వస్తుందనేది పెద్దల మాట.. టెక్నాలజీ పెంచుకోవాలి కానీ అది మంచి కోసం మాత్రమే వాడుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో ఎంత టెక్నాలజీ పెరుగుతూ ముందుకు పోతుందో అంతే స్పీడుగా అనేక కొత్త కొత్త వ్యాధుల బారిన పడుతున్నాం. మొన్నటి వరకు కరోనాతో ప్రపంచ దేశాలు మొత్తం సతమతమయ్యాయి. ప్రాణాలతో ఉంటే చాలు అనే స్థితికి ప్రజలు వచ్చారు. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని బయటపడ్డాం.. ఇది మరవకముందే మరో ఫ్లూ అందరినీ కలవర పెడుతోంది. అదే టమాటా ఫ్లూ. ఇది రాష్ట్రాల్లో వేగంగా పాకుతుంది.. మరి దీని పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. టమాటా ఫ్లూ అనేది ఒక రకమైన వైరస్. ఇది చెయ్యి, నోటి వ్యాధి అని అంటారు.
ఇది వ్యాపించిన వారికి చేతులు మరియు నోటిపై ఎర్రటి పొక్కులు వస్తాయి. దీంతో పాటుగా విపరీతమైన జ్వరం కూడా వస్తుంది. ప్రస్తుతం ఇది రాష్ట్రాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఎక్కువగా ఈ ఏడాది నుంచి ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లలకు మాత్రమే సోకుతుందట. ఈ కేసులు కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో నమోదయింది. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని ఈ వ్యాధి ఇన్ఫెక్షన్ ఏ విధంగా వ్యాపిస్తుందో గమనిస్తోంది. ఈ వ్యాధి దేశవ్యాప్తంగా వ్యాపించకుండా అప్రమత్తం చేస్తోంది. ఈ తరుణంలో అస్సాం రాష్ట్రంలో 100కు పైగా టమాటా ఫ్లూ కేసులు నమోదయ్యాయని, ఈ కేసులు ఎక్కువ దిబ్రాగర్ జిల్లాలోనే నమోదయ్యేట.
అంతేకాకుండా అక్కడ రెండు స్కూళ్లలో ఈ కేసులు ఎక్కువగా వచ్చాయని దీంతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. టమాటా ఫ్లూ అనేది ప్రాణాలు తీసేంత భయంకరమైన వ్యాధి కాదు. ఇది కక్స్ సాకీ అనే వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతోంది. ఇది ఎక్కువగా నోరు,ముక్కు నుండి వచ్చే ద్రవాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకినట్లయితే చేతులు, నోటిపై దద్దుర్లు, పొక్కులు, దురద ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందట. ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే త్వరగా అప్రమత్తం కావాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Tomato flu: టమాటా ఫ్లూ లక్షణాలు ఇవే.. కరోనా కంటే డేంజరా..?