Today top news: ఈరోజు 9 ముఖ్య వార్తలు..!

  1. మాండూస్ తుఫాన్ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం గా మారింది. దీంతో ఏపీ మరియు తమిళనాడు, కర్ణాటక ప్రాంతంల్లో జోరు వానలతో పాటుగా చలి తీవ్రత పెరుగుతుంది.. అంతేకాకుండా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
  2. నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై సిబిఐ ఈడీల విచారణ కొనసాగుతున్న సమయంలో ఆయన ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.. అంతేకాకుండా ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు సమాచారం.
  3. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బిజెపి సంచలన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో గుజరాత్ కొత్త సీఎంగా నేడు భూపేంద్ర పాటిల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ప్రధాన మంత్రి మోడీ హాజరవుతారని సమాచారం.
  4. ప్రతిరోజు రాశుల్లో మార్పులు వస్తూ ఉంటాయి.. ఈ మార్పుల ప్రకారమే మన జీవితం కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి అధిక మొత్తంలో ఆదాయం పెరుగుతుంది.. మేషరాశి,వృషభ రాశి,మిధున రాశి.
    5.fifa world cup 2022: పోర్చుగల్ తో పోటా పోటీగా సాగిన మ్యాచ్ లో మోరాకో టీం 1-0 తేడాతో విజయాన్ని అందుకుంది. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఆఫ్రికా నుండి తొలిసారి సెమీస్ కు చేరిన జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది.
  5. ఒక రూపాయికే సినిమా టికెట్ అందిస్తున్న మౌలాలిలో కొత్తగా ఏర్పాటు అయిన మూవీ మ్యాక్స్ ఏఎంఆర్ థియేటర్లో ఈ ఆఫర్ అందిస్తున్నారు.. ఈ థియేటర్ డిసెంబర్ 15న గ్రాండ్ గా ఓపెన్ చేయనున్న సందర్భంగా ఈ అవకాశాన్ని అందించారు యాజమాన్యం..
  6. పేద మధ్యతరగతి వారికి మోడీ సర్కార్ గుడ్ న్యూస్ అందించబోతోంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ఈనెల చివరికి లేదా జనవరి ఫస్ట్ కు అమలు కానున్నట్లు సమాచారం.
  7. అమెరికాలో నివసిస్తున్న ఇండియన్స్ కు గుడ్ న్యూస్. గ్రీన్ కార్డుల మంజూరులో ఒక్కొక్క దేశానికి కేటాయించే కోటాను తొలగించడం కోసం పెట్టిన బిల్లుకు వైట్ హౌస్ సపోర్ట్ లభించింది.
  8. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైశాలి కిడ్నాప్ కేస్ ను పోలీసులు చేదించారు.. ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 6 గంటల్లో యువతి జాడను కనుక్కున్నారు.. టీ స్టాల్ నవీన్ రెడ్డిని అరెస్టు చేశారు..
  9. Today top news: ఈరోజు 9 ముఖ్య వార్తలు..!