వారిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే.. మళ్లీ ఒకే డిపార్ట్మెంట్ లో పని చేస్తుంటారు.. ఓకే కులానికి చెందిన వారు కూడా.. ఇంకేముంది ఇద్దరి మధ్య కాస్త పరిచయం పెరిగింది.. యువతి సదరు ఉద్యోగిని నమ్మింది.. కానీ ఆ ఉద్యోగి మాత్రం ఆమెను ఆ విధంగానే చూశాడు.. నిన్ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు కూడా చెప్పాడు.. అతని మాటలను నమ్మిన యువతి, అతగాడితో ఏ పని చేయడానికి అయినా ఒప్పుకుంది.. అన్ని పనులు కానిచ్చేశాడు.. అలా వీరి ప్రేమయానం సాగుతున్న తరుణంలో అతగాడికి వివాహం జరిగిందని ఆ యువతికి తెలిసింది.. ఈ క్రమంలో మొదటి భార్యకు విడాకులు ఇస్తానని కూడా మళ్లీ నమ్మించాడు..
అలా చీకటి రోజులు ఎన్నో గడిపారు.. నువ్వంటే నాకు పిచ్చి లేదంటే చస్తా అనే విధంగా తీసుకువచ్చాడు.. ఇంతలో ఏం జరిగిందో ఏమో సదరు ఉద్యోగి ఆ యువతీతో ముఖం చాటేస్తూ వచ్చాడు.. దీంతో ఆ యువతి ఈ విషయాన్ని కాస్త బయట పెట్టింది.. పూర్తి వివరాల్లోకి వెళితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అబిద్ ఆలీ అనే వ్యక్తి డ్రగ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తాడు.. ఇదే డిపార్ట్మెంట్ లో ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నటువంటి బాధితురాలితో పరిచయం పెరిగింది.. కానీ అబీద్ కు అప్పటికే వివాహం జరిగింది.. కానీ ఈ విషయాన్ని ఆమెతో చెప్పకుండా చాలాసార్లు రాత్రులు కలుసుకున్నాడు. కొన్నాళ్లకు అతగాడికి వివాహం జరిగిందని ఆ యువతికి తెలిసింది.
దీంతో ఆ యువతీ నిలదీయడంతో నిన్ను వివాహం చేసుకుంటానని ఓసారి ప్రమాణం చేశాడు. అలా కొన్నాళ్ళకు ముఖం చాటేసాడు. బాధితురాలిని తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.. అయినా అబిత్ ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో.. ఆ యువతి ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతమిది నెట్టింట్లో వైరల్ గా మారాయి.. దీంతో స్పందించిన సదరు ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి కావాలని నాపై తప్పుడు చేస్తుందని అంటున్నాడు.. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
ఆయనో ఇన్స్ స్పెక్టర్ ఇదేం పాడుబుద్ధి.. అందంగా ఉందని కన్నేశాడు.. చివరికి..!!