చాలామందికి లైంగిక కలయిక విషయంలో అనేక అపోహలు మూఢనమ్మకాలు ఉంటాయి.. దీన్ని బయట చెప్పుకోవడానికి సిగ్గుపడతారు.. ఈ తరుణంలో వారికి ఉన్న ఆలోచనలు వారి మనసు వరకే పరిమితం అవుతాయి.. దీనిపై కొంతమంది సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు.. అలాంటిది ఒక సూచన మనం ఇప్పుడు తెలుసుకుందాం.. కలయిక తర్వాత చాలామంది మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు.. మరి మూత్ర విసర్జన చేస్తే మంచిదా.. అది అమ్మాయి చేయాలా లేదంటే అబ్బాయి చేయాలా అనేది ఇప్పుడు చూద్దాం..
లైంగిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కలయిక తర్వాత అలాగే కలయికకు ముందు మూత్ర విసర్జన చేయాలట. ఇది కేవలం పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా చేస్తే మంచిదని వారు అంటున్నారు.. దీనికి ప్రధాన కారణం కలయిక టైంలో మూత్రశయంలో మూత్రం ఉంటే, లోపల బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందని, అందుకే లైంగిక తర్వాత వెంటనే మూత్రం చేయడం వల్ల బ్యాక్టీరియా తొలగిపోతుందని లేదంటే ఆ బ్యాక్టీరీయ ఎక్కువ అయ్యే అవకాశం ఉందని వారు అంటున్నారు.
కలయికకు ముందు మూత్ర విసర్జన :
కలయికకు ముందు మూత్ర విసర్జన చేయడం వల్ల సంభోగాన్ని ఆనందంగా అనుభవిస్తారు.. ఒకవేళ ముసర్జన చేయకపోతే మాత్రం సంభోగ సమయంలో ఉద్వేగానికి చేరుకున్న తర్వాత నీ మనసు మూత్ర విసర్జన వైపు మల్లుతుందట.. దీనివల్ల మీరు ఎంజాయ్ చేయలేక పోతారని అంటున్నారు నిపుణులు.. ఈ విధంగా ముందుగా మూత్రశయాన్ని ఖాళీ చేయడం వల్ల మీరు చేసే పనిలో పూర్తిగా భావప్రాప్తి పొందుతారట. కాబట్టి కలయికకు ముందు పురుషులు అయినా సరే స్త్రీలైనా సరే మూత్ర విసర్జన చేస్తే బాగుంటుందని లైంగిక నిపుణులు తెలియజేస్తున్నారు.
లైంగిక కలయికకు ముందు తర్వాత చేయాల్సిన పనులు..!!