GROUP 2 EXAM
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1368 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.
ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను ఇప్పటికే టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. హాల్ టికెట్ డౌన్లోడ్ సంబంధించి ఏవైనా సమస్యలుంటే.. 040 22445566 లేదా 23542185 లేదా 23542187 నంబర్లలో సంప్రదించాలని టీజీపీఎస్సీ పేర్కొన్నది.

పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమై 12.30 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ప్రతిపేపర్‌కు 150 ప్రశ్నలుంటాయి. వీటికి 150 మార్కులు కేటాయించారు. గ్రూప్ 2 పరీక్ష ను సుమారు 5.57 లక్షల మంది రాయనున్నారు.

గ్రూప్ 2 పరీక్ష ముఖ్య సూచనలు
- అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి. (ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగి ఐడెంటీ కార్డు లేదా ఇతర ఒరిజినల్కార్డులు)
- హాల్‌టికెట్‌లో ఫొటో, సంతకం, ఇతర వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఏవైనా తప్పులు గుర్తిస్తే ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి.
- హాల్‌టికెట్‌లో ఫొటో ప్రింట్ కాకపోతే ఫొటో అతికించి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించాలి.
- ప్రశ్నాపత్రం తీసుకున్న వెంటనే దానికిపై మీ హాల్‌టికెట్ నంబర్ వేసి 150 ప్రశ్నలు సరిగా ఉన్నాయో లేదో కౌంట్ చెక్ చేసుకోవాలి.
- అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లరాదు. చేతి వాచ్‌ను కూడా అనుమతించరు.
- బ్లూ లేద బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో పాటు హాల్‌టికెట్, గుర్తింపు కార్డు మాత్రమే వెంట తీసుకెళ్లాలి. ఎలాంటి ఇతర తెల్ల కాగితాలను కూడా అనుమతి నిరాకరిస్తారు.
- అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు జవాబును గుర్తించాలి. జవాబు తెలియకపోయినా.. మీకు సరైనది అనిపిస్తే దానికి బబ్లింగ్ చేయాలి. నెగెటివ్ మార్కులు ఉండవు.
- బబ్లింగ్ పూర్తిగా గుండ్రంగా చేయాలి. లేదంటే జవాబు పత్రాల స్కానింగ్ సమయంలో మీ జవాబును కంప్యూటర్ గుర్తించకపోవచ్చు.
- బబ్లింగ్ చేసేముందు ప్రశ్న నంబర్‌ను మరోసారి చెక్ చేసుకోవాలి.