TG TET 2025
తెలంగాణాలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏడాదికి రెండు సార్లు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా 2025లో ఫేజ్ 1 టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇటీవల 2024 ఫేజ్ 2 సంబంధించి టెట్ పరీక్షలు జనవరి లో నిర్వహించి ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ JOB CALENDER 2025 ప్రకారం ఏప్రిల్ చివరి వారంలోగా టెట్ నోటిఫికేషన్ TET NOTIFICATION విడుదల చేసి జూన్ మొదటి వారంలో టెట్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణాలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్‌తో పాటు ఇతర ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలను ప్రభుత్వం. పెండింగ్‌లో పెట్టింది.
ఎస్సీ వర్గీకరణ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నందున్న ఈ టెట్ నోటిఫికేషన్ అనంతరం తెలంగాణాలో 5లేదా 6వేల ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ DSC NOTIFICATION 2025 విడుదలయ్యే అవకాశం ఉంది.
మరో 15 రోజుల్లో ఈ అకడమిక్ ఇయర్ ముగుస్తున్న నేపథ్యంలో అనంరతం టెట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. ఈ సారి నిర్వహించే టెట్‌లో ఎలాంటి పెద్ద మార్పులు ఉండవు. పాత సిలబస్‌నే కొనసాగిస్తూ.. ఆన్లైన్లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందు నిర్వహించనున్న ఈ టెట్‌కు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది.
TG TET NOTIFICATION 2025: త్వరలో టెట్ నోటిఫికేషన్ విడుదల
మరిన్ని వివరాలకు టెట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.