తెలంగాణ టెట్ హాల్టికెట్లు డౌన్లోడ్
జనవరి 2వతేదీ నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ టెట్ పరీక్ష హాల్టికెట్లు TG TET HALL TICKETS కాసేపట్లో విడుదల కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం టెట్ పరీక్ష నిర్వహించనుంది. టెట్ పరీక్ష అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించడంతో ఈ టెట్ పరీక్షకు గతం కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేశారు.

టెట్ పేపర్–1, పేపర్–2 కలిపి మొత్తం 2,48,172 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరికి జనవరి 02 నుంచి 20వతేదీ వరకు ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి 4.30 వరకు రెండు సెషన్లు ఉంటాయి.
TG TET HALL TICKETS: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు