TS TET HALL TICKETS
టీఎస్ టెట్ హాల్‌టికెట్లు మరింత ఆలస్యం కానున్నాయి.. ఈ మేరకు టెట్ కన్వీనర్ రాధారెడ్డి ప్రకటన విడుదల చేశారు.. దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు టెట్ హాల్‌టికెట్ల కోసం ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులను నిరుత్సాహ పరుస్తూ ఆలస్యమవుతాయని అధికారులు తెలపడం గమనార్హం.

ముందస్తు షెడ్యూల్ ప్రకారం మే 15న టెట్ హాల్ టికెట్లు విడుదల కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల దృష్ట్యా టెట్ హాల్ టికెట్లు మే 16 న విడుదల చేస్తామని వెబ్సైట్లో ప్రకటన వేశారు. అయితే అభ్యర్థులు మే 16 ఉదయం 11 గంటల వరకు హాల్ టికెట్లు వస్తాయని ఆశతో వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారు. కానీ సాయంత్రం వరకు కూడా హాల్ టికెట్లు అందుబాటులోకి రాకపోవడం తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
మరో మూడు రోజుల్లోనే పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హాల్ టికెట్లు అందక పోవడంపై ఆందోళన చెందుతున్నారు. దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు, వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు. ముందస్తుగా సెలవులు పెట్టుకోవడం ప్రయాణాలు చేయడం ఇబ్బందిగా ఉంటుందని సెంటర్ ఎక్కడో మరియు పరీక్ష తేదీ క్లారిటీ వస్తే తాము పరీక్షకు సిద్ధం కావచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
ఈ నేపథ్యంలో వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తొలగలేదని టెట్ హాల్ టికెట్లు ఈరోజు మే 16 సాయంత్రం లేదా మే 17 ఉదయం విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ ప్రకటించడం కొసమెరుపు..
TET HALL TICKETS MORE LATE: టెట్ హాల్‌టికెట్లు మరింత ఆలస్యం!