విద్యార్థులకు గుడ్న్యూస్… నవంబర్ నెలలో మరో మూడు రోజులు వరస సెలవులు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. నవంబర్ నెలాఖరులో 28, 29, 30 తేదీల్లో ఈ సెలవులు రానున్నాయి.. పూర్తి వివరాలివే..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ సెలవులను ప్రకటించింది. ఎన్నికల ఏర్పాట్ల దృష్ట్యా 28, 29 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తున్న కేంద్రాలు ఉన్న స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయి.
నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, ఇతర సంస్థలన్నింటికి సెలవు ప్రకటించారు.
3 DAYS SCHOOL HOLIDAYS 2023: స్కూళ్లకు మరో మూడు రోజులు వరస సెలవులు