Ts: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పు.. హైకమాండ్ నిర్ణయం అదేనా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు సంక్షోభాలు పెరుగుతున్నాయి. అందరూ సీనియర్లే కావడంతో ఏ ఒక్కరు కూడా తగ్గేదేలే అంటూ పార్టీ అభివృద్ధిని పక్కనపెట్టి ఒకరిపై ఒకరు అసహనాన్ని వెళ్ళగక్కుకుంటున్నారు. దీంతో సీనియర్ల వ్యవహారం పార్టీకి తీవ్రమైన తలనొప్పిగా మారింది. ప్రజల్లో రోజురోజుకు మసకబారి పోతోంది. రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ గాడిన పడుతుందని అందరూ భావించారు. కానీ కొంతమంది సీనియర్లకు మరియు రేవంత్ రెడ్డికి అసలు సెట్ అవ్వటం లేదని ఈ మధ్యకాలంలో జరిగిన గొడవలు చూస్తే అర్థమవుతుంది.

దీనిపై హై కమాండ్ కూడా సీరియస్ గా తెలుస్తోంది.. మొన్నటికి మొన్న జరిగిన రచ్చ కారణంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ సీనియర్లతో సుదీర్ఘ చర్చలు జరిపారు. మరి ఈ చర్చలతో సీనియర్లు చల్లబడ్డారా .. లేదా అన్నది తెలియాల్సి ఉంది .. చర్చలు జరిపి నివేదిక తీసుకొని వెళ్ళిన దిగ్విజయ్ సింగ్ ఆ నివేదిక హై కమాండ్ కు సమర్పించారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభానికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మార్పుతోనే ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. సమస్యలన్నింటికీ కారణం మాణిక్యం ఠాగూర్ అని సీనియర్లు దిగ్విజయ్ కి చెప్పినట్టు సమాచారం. ఇన్చార్జిని మారిస్తేనే సెట్ అవుతుందని వారు అన్నట్టు తెలుస్తోంది.

దీంతో ఢిల్లీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరో ఇన్చార్జి ని పెట్టడానికి అధిష్టానం అన్వేషణ మొదలుపెట్టిందని, ఈ రేసులో హర్యానాకు చెందిన దళిత నేత పునియా ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏది ఏమైనా తెలంగాణకు ఏ సమస్య వచ్చినా నేతలు మాత్రం బహిరంగంగా బయటపడద్దని సీనియర్లకు సూచించినట్టు సమాచారం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల వ్యవహారం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Ts: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పు.. హైకమాండ్ నిర్ణయం అదేనా..?