summer holidays extended:ఏపీలో వేసవి సెలవులు పొడగింపు

ap summer holidays

ఆంధ్రప్రదేశ్​లో స్కూళ్లకు వేసవి సెలవులను పొడగించారు. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించడడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దృష్ట్యా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల విజ్క్షప్తి మేరకు వేసవి సెలవులను పొడగిస్తూ… విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది..

ఏపీలో జూన్​ 12న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు, వివిధ ఉద్యోగ సంఘాలు హాజరు కానుండడంతో వారి వినతి మేరకు వేసవి సెలవులను జూన్​ 12 వరకు పొడగిస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. దీంతో జూన్​ 13న పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.

summer holidays extended:ఏపీలో వేసవి సెలవులు పొడగింపు