బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేక విషయాలని చెప్పారు.. ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయని అందరూ అంటుంటారు.. ఆయన వేప చెట్టుకు కల్లు కారుతుంది అని కూడా చెప్పారు.. అలాంటి ఓ ఘటనే ఖమ్మం జిల్లాలో జరిగింది.. వివరాలు ఏంటో చూద్దాం.. బ్రహ్మంగారు చెప్పింది జరుగుతోందంటూ అక్కడ జనమంతా అనుకుంటున్నారు. వేప చెట్టుకు కళ్ళు కారడాన్ని వింతగా చూస్తున్నారు.
ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం భాగ్యనగర్ గుడి తండాకు చెందిన రాందాస్ కుటుంబ సభ్యులు వేప చెట్టుకు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే కొంతకాలంగా ఈ చెట్టు నుంచి తెల్లని ద్రవం కారటం గమనించారు. ముందు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. జాగ్రత్తగా గమనించి చూస్తే కల్లులా అనిపించింది. దీంతో వేప చెట్టుకి కళ్ళు కారుతుంది అనే వార్త ఈ నోట ఆ నోట తెలియడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో ఆ తండాతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి వింతగా చూస్తున్నారు. ఇది దేవుని మహిమ అంటూ బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతోందంటూ మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా తాటి ,ఈత వనాలకు మాత్రమే కల్లు వస్తుంది. కానీ వేప చెట్టు నుంచి కల్లు కారణం ఏంటో ఇప్పటికీ అంతు పట్టడం లేదంటున్నారు స్థానికులు. ఇక కొందరైతే ఏకంగా పూజలు చేస్తూ కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు..
బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా.. ఖమ్మం జిల్లాలో వింత ఘటన..!!