Sridevi: ఆ హీరో కోసం ఏకంగా వారం రోజులు అన్నం తినని శ్రీదేవి..కారణం..?

పేరుకే తమిళ హీరో కానీ దేశవ్యాప్తంగా చాలా ఇండస్ట్రీలలో ఈయన పేరు సంచలనం.. ఆయన యాక్టింగ్ వేరే లెవెల్.. చూడటానికి బాగా అందంగా ఉండే హీరో కాదు.. కేవలం తన నటన స్టైల్ తోనే దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.. కండక్టర్ గా తన ప్రస్థానం స్టార్ట్ చేసిన ఆయన సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారారు.. ఆయన ఎవరో కాదు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆయన ఇంతటి స్టార్ హీరో కావడానికి ఎంతో కృషి ఉంది.. అలాంటి స్టార్ హీరో రజనీకాంత్ సినిమాలే కాకుండా రాజకీయంగా కూడా యాక్టివ్ గా ఉంటారు..

అలాంటి రజనీకాంత్ అప్పట్లో అతిలోకసుందరిగా పేరుగాంచిన అందాల భామ శ్రీదేవి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి.. దాదాపుగా 25 సినిమాల వరకు కలిసి చేశారు.. అలాంటి రజనీకాంత్ కోసం శ్రీదేవి ఏడు రోజులు అన్నం మానేసింది.. అది ఎందుకో తెలుసుకుందాం.. 2011లో రజనీకాంత్ రానా అనే సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ టైం లోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది.. వైద్యం కోసం సింగపూర్ తీసుకెళ్లాల్సి వచ్చింది..అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీదేవి ఒక్కసారిగా మనస్థాపానికి గురయ్యింది..

రజనీకాంత్ ఆరోగ్యం ఎలాగైనా మెరుగుపడాలని కోరుకుంటూ షిరిడి సాయిబాబాను దర్శించుకొని ఆమె ఏడు రోజులపాటు ఉపవాస దీక్ష చేపట్టింది. ఆ తర్వాత రజనీకాంత్ కోలుకొని ఇండియాకు తిరిగివచ్చారు. వెంటనే ఆయన ఇంటికి భర్త బోనీ కపూర్ తో కలిసి కలవడానికి వచ్చింది. కోలుకొని వచ్చిన రజినీకాంత్ ను చూసి సంబరపడిపోయింది.. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మరోసారి గుర్తు చేసుకున్నారు..