సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఇలాంటి తరం హీరోలకు సినిమా రిలీజ్ విషయంలో ఎంతో పోటీగా ఉండేది.. ఇక సంక్రాంతి వచ్చిందంటే వీరు సినిమాలు వరుసగా రిలీజ్ అయితే ఉత్కంఠమైన పోరు ఏర్పడేది.. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ గా పోటీ ఏర్పడింది. అదికూడా తండ్రి ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ మధ్య సినిమా పోటీ ఏర్పడింది.. మరి ఇందులో గెలుపొందింది ఎవరు అనే విషయాలు చూద్దాం.. సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పగానే పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. సాధువు పాత్ర వేయాలన్న, దేవుడి పాత్ర చేయాలన్న ఎన్టీఆర్ కు సాటి మరెవరు లేరని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఆయన సాధువు గెటప్ వేసిన మూవీ బాగా పేరు తీసుకొచ్చింది.. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.ఈ సినిమా వందకు పైగా ప్రింట్లతో విడుదైనా తొలిచిత్రంగా రికార్డు సృష్టించింది. ఇందులో బాలకృష్ణ సిద్ధ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమాకు స్వయానా ఎన్టీఆర్ దర్శకత్వం చేశారు. 1984 నవంబర్ 29 సినిమా విడుదల అయింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం కథ మీద వచ్చిన ఈ మూవీ అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు. అలాంటి సినిమాకు పోటీగా వచ్చిన సినిమాలు ఏంటో చూద్దాం.. ఈ సినిమాకు 13 రోజుల ముందు శోభన్ బాబు నటించిన మానవుడు దానవుడు సినిమా వచ్చింది. సినిమాలో హీరో రోల్ చాలా బాగున్నా కానీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదట.
దీంతో పాటుగా మరో మూవీ మోహన్ బాబు నటించిన గృహలక్ష్మి నవంబర్ 23న రిలీజ్ అయింది. రాధిక హీరోయిన్గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఎన్టీఆర్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాకి ఒక్కరోజు ముందుగా విడుదలైంది అక్కినేని నాగేశ్వరరావు సంగీత సామ్రాట్ .. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే తను నటించిన సినిమాకు తానే పోటీగా వచ్చారు బాలకృష్ణ.. అదే కథానాయకుడు.. డిసెంబర్ 14న ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ విధంగా తండ్రీ కొడుకుల మధ్య వచ్చిన సినిమా పోటీలో సంచలన విజయమందుకుంది శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఆ తర్వాత కథానాయకుడు నిలిచింది అని చెప్పవచ్చు.
Sr: NTR సినిమాకి పోటీగా దిగిన బాలకృష్ణ.. గెలిచింది ఎవరంటే..?