స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ స్థాయిలో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ సర్కిల్లో 525 పోస్టులు, అమరావతి సర్కిల్లో 50 ఖాళీలున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఎస్బీఐ 8,773 పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 17 నుంచి ప్రారంభం అయింది. డిసెంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు
అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష జనవరి 2024లో నిర్వహిస్తారు. సెలెక్టయిన వారికి నెలకు జీతం రూ. 19,900 బేసిక్ పే చెల్లిస్తారు.
అభ్యర్థులు అప్లై చేసేందుకు కింది లింక్ క్లిక్ చేయండి.
https://sbi.co.in/web/careers/current-openings
sbi clerk notification 2023: ఎస్బీఐలో 8,773 ఉద్యోగాలకు నోటిఫికేషన్