ration cards EKYC: తెలంగాణ, ఏపీ రేషన్ కార్డుదారులందరికీ పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రేషన్ కార్డు లబ్దిదారులు రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇతర సరుకులు అందుకుంటున్న విషయం తెలిసిందే.. అయితే వీరు ఇక ముందు కూడా రేషన్ పొందాలంటే.. రేషన్ షాపుల్లో ఈ కేవైసీ ఈ నెల 29లోపు పూర్తి చేసుకోవాలని సూచించింది.
అయితే ఈ కేవైసీ ration cards EKYC గడువు జనవరి 31నే ముగియగా.. మరోసారి గడువును పెంచారు. తెలంగాణా, ఏపీలో మరో 20 శాతం మంది ration cards EKYC చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. వీరందరూ..కూడా తప్పకుండా రేషన్ షాపులకు వెళ్లి ఫింగర్ ప్రింట్ ఇవ్వడం ద్వారా ration cards EKYC పూర్తవుతుందని తెలిపారు. లేనియెడల వారికి రేషన్ అందదని స్పష్టం చేశారు.
రేషన్ కార్డు ఈకేవైసీ ration cards EKYC పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగా కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు స్వీకరించారు. వీటన్నింటిని ఆన్లైన్ చేశారు. దాదాపు 5లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు.
అయితే మరోసారి రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించాలని ఆలోచన చేస్తున్నారు. వీటిపై మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.
RATION CARDS E KYC: టీఎస్ రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్
మరిన్ని అప్డేట్స్ కోసం http://news24telugu.com http://paalapitta.com వెబ్సైట్లను సంప్రదించండి.