భారత తపాల శాఖలో 1899 పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మెన్ ఖాళీల భర్తీకి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
ఖాళీలు వివరాలు..
పోస్టల్ అసిస్టెంట్ 589 పోస్టులు
పోస్ట్‌మెన్ : 585 పోస్టులు
సార్టింగ్ అసిస్టెంట్ : 143 పోస్టులు
మెయిల్ గార్డ్ : 03 పోస్టులు
ఎంటీఎస్: 570 పోస్టులు
ఇందులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ 51 ఖాళీలు, తెలంగాణ సర్కిల్లో 91 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలివే..
పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత, మెయిల్ గార్డ్ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణత, ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు వివిధ స్థాయిలలో క్రీడాకారులై ఉండాలి.
దరఖాస్తు చేయండిలా..
దరఖాస్తు ఫీజు రూ.100 మాత్రమే, ఆన్లైన్లో అప్లై చేసేందుకు డిసెంబర్ 09 చివరితేదీ,
మరిన్ని వివరాలకు పోస్టల్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.