Paramedical courses 2024-25
తెలంగాణ పారమెడికల్ బోర్డు 2024–25 విద్యా సంవత్సరానికి తెలంగాణాలోని ప్రభుత్వ, ప్రైవేటు పారమెడికల్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
రెండేళ్ల వ్యవధితో అందిస్తున్న పారమెడికల్ కోర్సులకు ఇంటర్మీడియేట్ బైపీసీ పూర్తయిన విద్యార్థులు అర్హులు. ఎంపీసీ అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఆసక్తి గల వారు అక్టోబర్ 30వతేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి పత్రాలతో జిల్లా డీఎంహెచ్వో కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో మొత్తం 40 ప్రభుత్వ కాలేజీల్లో 3122 సీట్లు అందుబాటులో ఉండగా.. వీటితో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల భర్తీకి నవంబర్ 13వరకు కౌన్సెలింగ్ పూర్తి చేసి 20వతేదీ లోగా సెలెక్షన్ లిస్టు విడుదల చేస్తారు.
అందుబాటులో ఉన్న కోర్సులు
- డిప్లొమా ఇన్ పెర్ఫ్యూజన్ టెక్నిషియన్
- డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్
- డిప్లొమా ఇన్ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్
- డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ టెక్నిషియన్
- డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్
- డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్
- డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నిషియన్
- డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నిషియన్
- డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరఫీ టెక్నిషియన్
- డిప్లొమా ఇన్ రేడియో థెరఫీ టెక్నిషియన్
- డిప్లొమా ఇన్ ఆప్తోమెట్రీ టెక్నిషియన్
- డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నిషియన్
- డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నిషియన్
- డిప్లొమా ఇన్ క్యాథల్యా టెక్నిషియన్
- డిప్లొమా ఇన్ రెడియో గ్రాఫిక్ అసిస్టెంట్
- డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్
- డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్
- డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నిషియన్
- డిప్లొమా ఇన్ డెంటల్ హైజినిస్ట్
- డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ పారామెడికల్ టెక్నిషిన్
- డిప్లొమా ఇన్ మైక్రోసర్జరీ టెక్నీషియన్