ONGC Scholarship: విద్యార్థులకు ఓఎన్‌జీసీ గుడ్‌న్యూస్‌.. ఎంపికైతే ఏడాదికి రూ. 48 వేల స్కాలర్‌షిప్‌

మీరు బీటెక్‌, ఎంబీబీఎస్‌, ఎంబీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారా? అయితే, మీకో గుడ్‌న్యూస్‌. ఆర్థికంగా వెనుకబడిన మెరిట్‌ విద్యార్థులకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ONGC) లిమిటెడ్‌ స్కాలర్‌షిప్‌ అందజేస్తుంది. ఓఎన్‌జీసీ ఫౌండేషన్‌ 2023-24 ఏడాదికి సంబంధించిన స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ను రిలీజ్‌ చేసింది.

ఎవరెవరు అర్హులు?

ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌, ఎంబీఏ, పీజీ (జియాలజీ/ జియో ఫిజిక్స్‌) కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. మొత్తం రెండు వేల మందిని ఎంపిక చేసి స్కాలర్‌షిప్‌లు అందజేస్తుంది. జనరల్‌ కేటగిరీకి 500, ఓబీసీలకు 500, ఎస్సీ/ఎస్టీలకు 1000 మందికి చొప్పున స్కాలర్‌షిప్‌లు అందజేస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన వారు ఏడాదికి రూ. 48,000 చొప్పున కోర్సు పూర్తయ్యేంత వరకు పొందవచ్చు.