మన భారతదేశం అంటేనే అనేక సాంప్రదాయాలకు పుట్టినిల్లు.. ఇక్కడ ఏ పని చేయాలన్నా జ్యోతిష్యాన్ని బేస్ చేసుకుని మొదలుపెడతారు.. ఈ జ్యోతిష్యాల లో కూడా రకరకాలు శాస్త్రాలు ఉన్నాయి. కొంతమంది హస్తాన్ని చూసి మరి కొంతమంది నెంబర్లను చూసి ఇంకొంతమంది ముఖాన్ని చూసి జ్యోతిష్యం చెబుతూ ఉంటారు.. ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వారికి ఎలాంటి లాభాలు ఉంటాయో,శుభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
నంబర్ 1. ఈ నెలలో 1,10,19,28 తేదీల్లో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం వన్ నెంబర్ వస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు మీకున్నటువంటి కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలి. ఏ పని మొదలుపెట్టిన త్వరగా జరుగుతుంది. ఇలాంటి అధికారిక సమస్యలైన పరిష్కరించుకుంటారు.ఎవరి సహాయం కోరకుండా ముందుకు పోతారు. ముఖ్యంగా క్రీడాకారులు డిజైనర్లు, బిల్డర్లు, రాజకీయ నాయకులు కొత్త ప్రాజెక్టులను పొందడానికి డబ్బు శక్తిని ఉపయోగించుకోవాలి. ఎక్కువగా సూర్యభగవానున్ని ఆరాధించండి. ఆయన మంత్రాన్ని జపించండి.. కలర్ ఎల్లో బ్లూ, లక్కీ నెంబర్ 9, కలిసొచ్చే రోజు ఆదివారం.. ఆశ్రమాలకు వస్త్రాలను దానం చేయాలి.
నంబర్ 2: ఈ నెలలో 2,11,20 తేదీల్లో జన్మించిన వ్యక్తులపై నెంబర్ 2 ప్రభావం ఎక్కువగా ఉంటుంది.. ఈ తేదీల్లో పుట్టిన జంటలు ప్రయాణాన్ని ఆస్వాదించడానికి ఒక మంచి రోజు.. ఆఫ్లైన్ కంటే ఇంటి నుంచే పని చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యాపారానికి సంబంధించిన కొన్ని జాప్యంతో పూర్తవుతాయి. ప్రయాణాలు చేయొద్దు.. ముఖ్యంగా న్యాయవాదులు, రాజకీయ నాయకులు, చిల్లర వ్యాపారులు, విద్యావేత్తలు డాక్యుమెంట్లపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త.. కలిసొచ్చే కలర్ స్కై బ్లూ, లక్కీ నెంబర్ 2,6, ఆలయాల్లో పెరుగును దానం చేయాలి. కలిసొచ్చే రోజు సోమవారం.
నంబర్ 3: ఈ నెలలో 3,12,21,30 తేదీల్లో జన్మించిన వారు న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 3వస్తుంది. అరటి చెట్లకు చెక్కర నీటిని పోయండి. విద్యావేత్తలు, మార్కెటింగ్ సేల్స్, యువకులు, సంగీత కళాకారులు, డిజైనర్లు విద్యార్థులు, రాజకీయ నాయకులు, గృహిణులు, వారి వారి వృత్తిలో విశేష లాభాన్ని పొందుతారు. వీరికి కలిసివచ్చే కలర్ బ్లూ, ఆలయాల్లో ఎల్లో రైసును దానం చేయాలి. లక్కీ నెంబర్ 3, గురువారం రోజు వీరికి మంచి జరుగుతుంది.
Numerology today: ఈ తేదీల్లో పుట్టిన వారికి కోట్లాది లాభాలు.. కానీ ఇవి పాటించాలి..!!