మన భారతదేశంలో చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఈ జ్యోతిష్యంలో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి సంఖ్యాశాస్త్రం, రేఖా శాస్త్రం, పాచికలు ఇలా ఎవరికి తెలిసిన విధంగా వారు జ్యోతిష్యాన్ని చెబుతూ ఉంటారు. అలాంటిది సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరిని కూడా చాలా ఈజీగా నమ్మరట.. ఆ తేదీలు ఏంటి? ఆ నెంబర్స్ ఏంటి? అనేది చూద్దాం..
జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెల అయినా సరే 9,18,27 తేదీల్లో జన్మించిన అమ్మాయిలకు 9 సంఖ్య వస్తుంది. ఈ తేదీలు అంగారకుడికి అధిపతి.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలపై ఈ ప్రభావం చాలా ఉంటుంది.. చాలా ధైర్యసాహసాలు చేస్తారు. ఈ సంఖ్య వచ్చే వ్యక్తులు ఎంత కోపాన్ని ప్రదర్శిస్తారో అంత కోపాన్ని అనుచుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటారు.. వీరు వీరి జీవిత చివరి దశలో కూడా విజయవంతంగానే ఉంటారట. ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోరు. అంతేకాకుండా ఇతర వ్యక్తులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. ఒకవేళ వీరిపై ఎవరైనా అధిపత్యాన్ని చలాయించాలని చూస్తే ఊరుకోరు..
ఈ వ్యక్తులు తమ పనిలో విమర్శలు లేదా జోక్యాన్ని అస్సలు సహించరు. ఈ సంఖ్య వచ్చేవారు తమ జీవిత ప్రారంభంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, కానీ వాటన్ని తట్టుకొని కష్టపడి పని చేసుకుంటూ ముందుకు వెళ్లి చివరికి విజయం సాధిస్తారట. 9 సంఖ్య గల వ్యక్తులు అజాగ్రత్తగా, భావోద్వేగంగా ఉంటారని అంటున్నారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే 9, 18,27 చాలా శుభప్రదం అని అంటున్నారు. నెంబర్ 3 మూడు వచ్చే వారితో స్నేహం భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. వీరికి ఎరుపు రంగు శుభప్రదం, మంగళవారం ఉపవాసం ఆచరిస్తే మంచిది.
Numerology: ఈ మూడు తేదీల్లో జన్మించిన అమ్మాయిలు ఎవరినీ నమ్మరట.. కారణం..!!