NIT Recruitment 2022: వరంగల్ NIT లో ఫ్యాకల్టీ జాబ్స్.. అప్లై చేసుకోండి ఇలా..?

దేశంలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో వరంగల్ నిట్ ఒకటి. ఈ విద్యాసంస్థల నుంచి 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత, ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 27 నుంచి ప్రారంభమై జనవరి 25 వరకు ఎండ్ అవుతుందని తెలియజేసింది . మరి ఎందుకు ఆలస్యం అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోండి.

జాబ్స్:
ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయట .

విభాగాలు:
కెమిస్ట్రీ, ఫిజిక్స్, సివిల్ మెటలర్జికల్, మ్యాథ్స్, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ తదిత విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హతలు :
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో 60% మార్కులతో బీకాం, బీఎస్సీ, బిఏ, ఎంఈ, బిఈ, ఎమ్మెస్సీ, పీజీ, పీహెచ్ డి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరి వయసు 35-50 మధ్య ఉండాలని అన్నారు.

ఎంపిక విధానం :
మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి, మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేపడుతారు.
దరఖాస్తు చేసుకోవాలంటే ఈ లింకు పై క్లిక్ చేయండి .https://recruit.nitw.ac.in/register/?next=/