JNV TEST ENTRANCE TEST-2025
జవహార్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard?AspxAutoDetectCookieSupport=1 ఈలింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.(navodaya admit cards)
దేశవ్యాప్తంగా ఉన్న 653 జవహార్ నవోదయ విద్యాలయాల్లో(JNV) ఆరోతరగతి ప్రవేశాల కోసం జనవరి 18 ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. వీటి ఫలితాలు మార్చి నెలలో వెల్లడిస్తారు.
నవోదయ విద్యాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 15, తెలంగాణాలో 9 ఉన్నాయి. త్వరలో మరిన్ని జిల్లా కేంద్రాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.
నవోదయ పరీక్ష ద్వారా ఎంపికైన వారికి ఆరో తరగతి నుంచి 12వతరగతి వరకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యాలు కల్పిస్తారు. నాణ్యమైన బోధన ఉంటుంది. రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా విద్యార్థులను సెలెక్షన్ చేస్తారు.
NAVODAYA ADMIT CARD: నవోదయ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల