పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన ఘట్టం..మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది మంగళ స్నానం.. ఈ మంగళ స్నానం అనేది ఎలాంటి శుభకార్యాలు జరిగిన ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో పెళ్లికి ముందు వధూవరులకు తప్పనిసరిగా చేయిస్తారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న తంతు.. మరి మంగళ స్నానం ఎందుకు చేయిస్తారు దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేది చూద్దాం.. మన పెద్దవాళ్ళు ఏ పని చేసినా దాని వెనుక సైన్స్ దాగి ఉంటుందనేది మరువకూడదు..
అలాంటిది మంగళ స్నానం విషయంలో కూడా పెద్ద సైన్స్ దాగి ఉంది.. అదేంటయ్యా అంటే.. ముఖ్యంగా మంగళ స్నానం చేయించే సమయంలో నలుగు పిండి, పసుపు, నూనె,కుంకుడు కాయలు శుద్ధమైన నీటిని వాడతారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అంటే తప్పనిసరిగా వధువు లేదా వరుడు ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందడం కోసం ఈ మంగళ స్నానం అనే తంతును చేయిస్తారు. ముందుగా మన తలకి గట్టిగా నూనె మర్దన చేస్తారు. దీనివల్ల హెడ్ మసాజ్ అవుతుంది. ఆ తర్వాత కుక్కుడుకాయలతో తలకు రాస్తారు.
. దీని తర్వాత నలుగు పిండి శరీరమంతా రాయడం వల్ల చర్మంపై ఉండే డెడ్ సెల్స్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇది ప్రస్తుత జనరేషన్ లో డబ్బులు పెట్టుకొని చేసుకునే ఫేషియల్ లాంటిది. అంతేకాకుండా పసుపు మనకు ఆంటీ బయాటిక్ గా పని చేస్తుంది అనేది అందరికీ తెలుసు. దీనివల్ల చర్మం పై ఎలాంటి మృత కణాలు లేకుండా తొలగిపోయి కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.. ఈ విధంగా మంగళ స్నానం చేయించిన తర్వాత మన శరీరంలో గ్లో వస్తుంది. దీంతో పెళ్లికళ వచ్చింది అంటూ అంటుంటారు..
పెళ్లిలో మంగళ స్నానం చేయించడం వెనుక ఇంత చరిత్ర ఉందని తెలుసా..?