దోమల నివారణకు మార్కెట్లో లభిస్తున్న స్పేలు, లిక్విడ్స్ వాడిన ప్రయోజనం ఉండడం లేదా.. అవి కృత్రిమ మందులు ఆరోగ్యానికి హాని చేస్తాయని భయపడుతున్నారా? అయితే ఇంట్లో లభించే కొన్ని రెమిడీస్తో దోమలను పారదోలవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్పూరం:
పూజకు ఉపయోగించే కర్పూరం తో దోమలను నివారించవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో కర్పూరాన్ని వేసి గదిలో ఒక మూలలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల కర్పూరం వాసనకు దోమలకు ఇంటి నుంచి వెళ్లిపోతాయి.
తులసి రసం:
తులసి ఆకుల రసాన్ని చేతులకు, కాళ్లకు రాసుకుని నిద్రపోవడం వల్ల దోమలు మన దగ్గరకు రావు. దీంతో మనకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
అజినమోటో:
అజినమోటో అనే పదార్థం మన వండిన ఆహార రుచిని పెంచుతుంది. ఇది దోమలను తరిమికొట్టడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అజినమోటోను మెత్తగా రుబ్బుకోని. అందులో కొద్దిగా ఆవాల నూనె కలపాలి. దీంట్లో ఒక గుడ్డను నానబెట్టి ఇంట్లో వివిధ ప్రదేశాలలో ఉంచడం వల్ల దోమలు ఈ వాసనకు వెళ్లిపోతాయి.
వేప ఆకు
వేప చెట్టు ఆకు చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ ఆకులు దోమలను సులభంగా తరిమికొడతాయి. వేప ఆకులను ఒక పెద్ద కుండలో సేకరించి వాటిని కాల్చడం వల్ల ఆ పోగకు దోమలు పారిపోతాయి. ఇందులో కర్పూరం కూడా వేస్తే ఇంట్లో మంచి సువాసన వస్తుంది.
Mosquitos killes: ఇంట్లో ఉన్న పదార్థాలతో దోమలు పరార్..