mahesh babu restaurant:మహేష్ బాబు కొత్త రెస్టారెంట్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే హీరోగా సంచలనాలు సృష్టిస్తున్నారు. సినిమాలు చేస్తూ మరోవైపు యాడ్స్ లో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయన బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. అదే ఫుడ్ బిజినెస్.. ఇప్పటికే ఆయన చాలా బిజినెస్ లు చేస్తూ వస్తున్నారు. ఆయన సినిమాలు చేస్తూ ఉంటే మహేష్ బాబు భార్య నమ్రత బిజినెస్ లు అన్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది..

ఈ తరుణంలోనే హైదరాబాదులో మరొక కొత్త రెస్టారెంట్ ప్రారంభించారట. ఈ రెస్టారెంట్ లో ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ రేట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. మరి ఆ వివరాలు ఏంటో మనం కూడా చూద్దాం.. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ మూవీ థియేటర్ ను నడిపిస్తున్నారు. తాజాగా ఫుడ్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. తన భార్య నమ్రత పేరుపై నమ్రత ఏసియన్ గ్రూప్స్ ఏఎన్ పేరు మీద రెస్టారెంట్ ను ప్రారంభించారు.. ప్రస్తుతం ఆ రెస్టారెంట్ సంబంధించిన మెనూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ఈ మెను రేట్లను బట్టి చూస్తే బ్రేక్ ఫాస్ట్ నుండి మొదలు సాయంత్రం స్నాక్స్ వరకు అందరికీ అందుబాటులో ఉండే రేట్లలో ఉన్నాయి.. ఇందులో ప్లేట్ ఇడ్లీ 90 నుంచి 120 రూపాయల వరకు ఉంది. అంతేకాకుండా ప్లేట్ పూరి 170, అలాగే దోష 120 నుంచి మొదలు 250 వరకు ఉంది. ఇక స్నాక్స్ విషయానికి వస్తే ఏ స్నాక్స్ తీసుకున్న 125 రూపాయలు చెల్లించాల్సిందే. ఇక అందరూ ఇష్టపడే బిర్యాని మాత్రం 450 రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెనూలో ఉన్న రేట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

మహేష్ బాబు కొత్త రెస్టారెంట్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?