అలనాటి హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు మహానటి సావిత్రి. ఆమె షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టింది అంటే సింగిల్ టేకులో ఏ సీనైనా చకచకా చేసేసేది. అంతటి నటన టాలెంట్ తో మహానటిగా పేరు తెచ్చుకుంది. అప్పట్లో ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలు కూడా ఈమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు అంటే ఈమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మహానటి సావిత్రి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ఆమె తన నటనా టాలెంట్ తో ఎంత సంపాదించిందో, చివరి రోజుల్లో అంత దారుణంగా తన తుది శ్వాస విడిచింది.
అలాంటి మహానటి జీవితం గురించి తన కూతురు విజయ చాముండేశ్వరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.. చాముండేశ్వరి చిన్న వయసులో ఉన్నప్పుడు సావిత్రి పట్టించుకునే స్థితిలో ఉండేది కాదట. మేము ఏదైనా చెబితే బాధపడేది కానీ ఆమెలో మార్పు తెచ్చుకొని పద్ధతిని మార్చుకునేది కాదు. తన ఆరోగ్యం దెబ్బతిన్నా కానీ చాలా మొండిపట్టుతో ఉండేదని, ఇక ఆరోగ్యం బాగా క్షీణించే సమయంలో మా దగ్గరు బంధువుల్లో ఓ అబ్బాయి ని చూసి నాకు వివాహం జరిపించిందని తెలియజేసింది. ఆ తర్వాత ఆమె పూర్తిగా మద్యానికి బానిసై డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఏది ఏమైనా ఆమెను చూసి మేము గర్వపడుతూనే ఉంటామని అన్నారు..
కానీ మా అమ్మని చూసిన తర్వాత స్త్రీలు మానసికంగా,బలంగా ఉండాలని నాకు బాగా అర్థమైంది. దీంతో నేను నా ఫిట్నెస్ విషయాలపై ఎక్కువ శ్రద్ధ తీసుకునే దాన్ని.ఆరోగ్యం పై ఎక్కువ దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన కోర్సులు కూడా చేశానని, నా చుట్టూ ఉన్న వారికి గైడ్ చేస్తూ ఉంటానని అన్నది. ఏది ఏమైనా మా అమ్మ గ్రేట్ ఆమె చేతిలో రూపాయి లేకున్నా అడుక్కునే పరిస్థితికి అయితే రాలేదని, ఒకవేళ ఇస్తాము అన్నా కానీ ఎవరి దగ్గర తీసుకోలేదని, వేలాది మందికి దానధర్మాలు చేసిందని, మా అమ్మ అంత గొప్ప మనసు ఉన్న వారు దొరకడం చాలా కష్టమని తెలియజేసింది సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి.
మహానటి సావిత్రి చివరి రోజులు చాలా దారుణం.. అసలు విషయం బయటపెట్టిన కూతురు..!!