జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన కిరాక్ ఆర్పి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి ఆయన ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ తరుణంలోనే ఆర్పి ఎన్నో రోజుల కళ అయినా ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు.. ఆయన ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఆర్పి రెస్టారెంట్ పెట్టడమేంటంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో రెస్టారెంట్ స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. రానున్న రోజుల్లో ఇంకా 15 బ్రాంచ్ లు కూడా మొదలు పెడతానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. తను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ రెస్టారెంట్ల బిజినెస్ పై పెట్టుబడి పెడతానని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్పీ కి రోజు రెండు లక్షల రూపాయల బిజినెస్ జరుగుతుందని సమాచారం.
అంటే నెలకు 60 నుంచి 70 లక్షల రూపాయల బిజినెస్ జరిగితే ఆర్పికి 20 లక్షల స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో ఆయన అభిమానులంతా ఆర్పి ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలని, జీవితంలో మరింత ఎదగాలని, కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన చేపల పులుసు స్టవ్ పై కాకుండా కట్టల పొయ్యి పై చేయడం అందరినీ ఆకట్టుకుంటుంది.
కిరాక్ ఆర్పి చేపల పులుసు వ్యాపారం.. లక్షల్లో సంపాదిస్తున్నారా..?