Kidney: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..నిర్లక్ష్యం వద్దు ప్రాణాలకే ముప్పు..!!

మన శరీరంలో భాగాలన్నింటిలో కిడ్నీలు అనేవి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం నీరు ద్వారా అనేక మలిన పదార్థాలు మన శరీరంలోకి వెళ్తాయి. ఇందులో ఉన్నటువంటి కొన్ని మలినాలు మూత్రపిండ వ్యవస్థ ద్వారా బయటకు విసర్జింపబడతాయి. అలాంటి కిడ్నీలు పాడవుతున్నాయి అంటే మన శరీరంలో ఇలాంటి మార్పులు కనిపిస్తాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

త్వరగా అలసిపోవడం :
ఎప్పుడైనా సరే ఏ పని చేసినా త్వరగా అలసిపోతున్నాము అంటే అది కిడ్నీ ఫెయిల్ కి సాంకేతంగా చెప్పుకోవచ్చు. మూత్రపిండాల్లో జరిగే ప్రక్రియ సరిగ్గా జరగకపోతే రక్తంలో ఇతర మలినాలు పెరగడం వల్ల అలసటగా ఉండడం, బలహీనంగా అనిపించడం వంటివి జరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నిద్ర పట్టకపోవడం:
సాధారణంగా నిద్ర పట్టకపోవడం కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కి సాంకేతంగా చెప్పవచ్చు. కిడ్నీలు మూత్రాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయకపోవడం వల్ల, టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటకు వెళ్లకుండా రక్తంలో ఉండిపోతాయి. దీనివల్ల మీకు అనీజిగా ఉండి నిద్ర సరిగ్గా పట్టదు. రక్తంలో ప్రోటీన్స్ సరిగ్గా లేకపోతే చర్మం పొడిబారి దురద పుట్టడం వంటి లక్షణాలు ఉంటాయి. కాలక్రమమైన ఇది కిడ్నీ వ్యవస్థపై దాడి చేసే అవకాశం ఉంటుంది.

అధిక యూరిన్ చేయడం :
కొంతమంది సగటు కంటే ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్తూ ఉంటారు. ఇది మూత్రపిండ వ్యాధులకు సాంకేతం. మూతపిండాల్లో రక్తాన్ని శుద్ధి చేసి వడపోత చేసే భాగాలు దెబ్బతిన్నప్పుడు అది మూత్ర విసర్జన చేయాలని కోరికను బాగా పెంచుతుంది. కొంతమందిలో యూరిన్ చేస్తున్నప్పుడు బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక సాంకేతంగా చెప్పవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి సంకేతాలు ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

Kidney: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..నిర్లక్ష్యం వద్దు ప్రాణాలకే ముప్పు..!!