- అధికారంలోకి వచ్చిన వెంటనే మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడున్న పథకాలు ఆపకుండా వాటికి తోడుగా మరిన్ని పథకాలు ఇస్తామని తెలియజేశారు.
దళిత గిరిజనుల కోసం 27 పథకాలు ప్రారంభిస్తే సీఎం జగన్ వాటిని ఆపించారని అన్నారు. - రెండు తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు: వేకువ జాము నుంచే ఆలయాలకు కిక్కిరిసిన భక్తులు.
- భార్య నగలపై కన్నేసిన నేరమే: భార్య యొక్క నగల కేసులో భర్తకు ఉపశమనం కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ తెలిపింది.ఓ కేసు విచారణలో భాగంగా నగలు భార్య సొంత ఆస్తిగా తెలియజేసింది.
- ఎన్టీఆర్ 30: ధైర్యం ఒక వ్యాధిగా మారినప్పుడు.. భయం విరుగుడు అవుతుందట.. మరి దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలియాలంటే ఎన్టీఆర్ 30 చూడాల్సిందే. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర యూనిట్ తెలియజేసింది.
- మళ్లీ రాబోతున్న యోయో పరీక్ష : ఇండియా క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకోవాలి అంటే యోయో ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి అని బీసీసీఐ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
- డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు :
2022 డిసెంబర్ లోను జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లను దాటాయని.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 15% వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది.
7.BRS ఏపీ అధ్యక్షుడుగా ఎవరంటే: మాజీ ఐఏఎస్ అధికారి, తోట చంద్రశేఖర్ ను భారతీయ రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. నేడు సీఎం సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.
- 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ 2024 ఎన్నికల్లో మరోసారి పోటీలో ఉండనున్నారని ప్రకటించారు.
- భార్యపై అనుమానంతో అప్పుడే పుట్టిన బిడ్డను నేలకేసి కొట్టాడు ఓ కిరాతక భర్త. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది .
- 108వ సైన్స్ కాంగ్రెస్ ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నట్లు పిఎం ఓ కార్యాలయం తెలిపింది .