సాధారణంగా మనం వాహనం కొనేటప్పుడు అన్ని రకాలుగా చూసుకుంటాం.. ముఖ్యంగా మనం వాహనం కొంటే కలిసి వస్తుందా లేదా అనేది, ఎలాంటి రంగు వాహనం కొంటే కలిసి వస్తుంది అనేది జ్యోతిష్య నిపుణులు అడిగి మరీ తెలుసుకుంటాం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైన రంగులు ఉంటాయి.. అవి వారికి ఎంతో మేలు చేస్తాయి.. అలాంటివారు వారికి మేలు చేసే రంగు వాహనాన్ని కొంటే మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.. మరి ఆ రాశుల వారు ఎవరు, వారు ఏ రంగు వాహనాన్ని వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మేషరాశి :
ఈ రాశిలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు. ఇలాంటివారు వాహనం కొనుక్కోవాలి అనుకుంటే పసుపు, కుంకుమ, ఎరుపు, నారింజ రంగుల వాహనాలను కొనుక్కుంటే మంచిదంటూ శుభం కలుగుతుందని పండితులు అంటున్నారు.
వృషభ రాశి :
ఈ రాశి వారు చాలా తెలివైన వారు.. ఎలాంటి వారితో అయినా ఇట్టే కలిసి పోతారు.. ఆకుపచ్చ, తెలుపు, నలుపు వాహనం మంచిది..
మిధున రాశి :
ఈ రాశి వారు చాలా ఇంటిలిజెంట్.. ఈ రాశి వారికి కలిసొచ్చే కలర్ ఎరుపు, ఆకుపచ్చ, బూడిద.. ఈ రంగుల్లో వాహనాన్ని కొనడం మంచిదని నిపుణులు అంటున్నారు.
సింహరాశి:
ఈ రాశిలో పుట్టిన వారు చాలా గర్వంగా బ్రతుకుతారు. వీరు ప్రకాశమంతమైన రంగులను ఇష్టపడతారు.. పసుపు, ఎరుపు, కుంకుమ రంగులతో పాటు వీరికి వైట్ కలర్ చాలా అదృష్టాన్ని తెస్తుందని చెప్పవచ్చు.
తులారాశి :
ఈ రాశి వారు ఆలోచనపరులు. ఏ విషయంలోనైనా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కలిసొచ్చే కలర్ నలుపు, బూడిద, తెలుపు.. వాహనాలు కొనుగోలు చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి ఎప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవాలనే కోరిక ఉంటుందట. వాహనాల కొనుగోలు విషయంలో కూడా కొత్తదనం ఉండాలని చూస్తారట. ఈ రాశి వారికి పసుపు, కుంకుమ, గోధుమ రంగులు మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.