సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ అనేవారు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. కానీ అతి తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికి నిలిచిపోతూ ఉంటారు. ఇక అలాంటి అల్లరి నటులలో లేడీ కమెడియన్ కోవై సరళ కూడా ఒకరు. ఆమె ఎలాంటి పాత్ర చేసినా కూడా జనాలకు చాలా ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇక వెండితెరపై ఎంతో మందిని నవ్వించే కమెడియన్ కోవై సరళ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి.
కోవై సరళ తెలుగు,తమిళ ఇండస్ట్రీ లలో దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించింది. సినిమాల్లో కోవై సరళ డైలాగ్ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కమెడియన్ బ్రహ్మానందం సరసన భార్యగా కోవై సరళ ఎన్నో సినిమాల్లో నటించింది. వీరి కాంబినేషన్ కి అప్పట్లో మంచి పేరు ఉండేది. కోవై సరళ దాదాపు 800కు పైగా సినిమాల్లో నటించింది. ఇక కోవై సరళ వయసు దాదాపు 60 సంవత్సరాలు. అయితే ఇన్ని సంవత్సరాలైనా ఆమె పెళ్లి చేసుకోక పోవడానికి ప్రధాన కారణం..
ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడమే. కోవై సరళ తన నలుగురు చెల్లెళ్ల జీవితాన్ని తన భుజాల మీద వేసుకొని వారికి పెళ్లిలు చేసి పిల్లల బాధ్యతను కూడా తీసుకుంది. దీంతో చెల్లెళ్ల కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది కోవై సరళ. అంతేకాదు తన చెల్లెలి పిల్లలని చదివించి ఒక మంచి పొజిషన్ లో నిలబెట్టాలన్నదే ఆమె జీవిత లక్ష్యం అంటూ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది కోవై సరళ.
కోవై సరళ జీవితంలో ఇంతటి త్యాగం ఉందా.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..?