ప్రస్తుతం ఆధునిక జీవనశైలితో భార్యాభర్తల మధ్య సంతానలేమి సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడం. పోషక విలువలు ఉన్న ఆహారం తినకపోవడం. జంక్ ఫుడ్,ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం. అంతేకాకుండా వంశపారం పర్యంగా కొన్ని సమస్యలు రావడం వల్ల దంపతుల్లో సంతానలేమి ఏర్పడుతోంది. దీనివల్ల పెళ్లయిన దంపతులు ఎంతో కృంగిపోతున్నారు. అలాంటివారు ఈ ఆహార పదార్థాలు తింటే కోట్ల లో వీర్యకణాలు పెరుగుతాయని వైద్య నిపుణులు అంటున్నారు..
వెల్లుల్లి :
సంతాన లేమితో బాధపడే దంపతులు వెల్లుల్లి ఎక్కువగా తినాలి. దీనిలో విటమిన్ బి6, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని కొద్ది రోజులపాటు రెగ్యులర్ గా తింటే స్త్రీ పురుషుల్లో ఫెర్టిలిటీ స్థాయి పెరిగి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
పాలకూర:
పురుషుల వీర్యకణాల సంఖ్య పెరగాలంటే పాలకూర ఎంతో ఉపయోగపడుతుంది. పాలకూరలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారంలో రెండు సార్లైనా పాలకూర తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.
కోడిగుడ్డు :
ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. దీనిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త కణాల పునరుత్పత్తిలో సహాయపడుతుంది. గుడ్డు లో ఉండే ఆంటీ యాక్సిడెంట్ కణాలకు ఒక ప్రొటెక్షన్ లేయర్ లా ఉండి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే గుడ్డు ప్రతిరోజు తినాలని డాక్టర్లు అంటున్నారు.