ఇంటర్ పూర్తయిన చాలామంది యువతి, యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సైన్యంలో పని చేయాలనుకునే వారికి సదావకాశం. ఆర్మీ వింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది.. ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్ లో ఎంపీసీ గ్రూప్ ఉండాలి . ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష ప్రాసెస్ :
ఇందులో ముఖ్యంగా రెండు పేపర్లు ఉంటాయి. ప్రశ్నలు కూడా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి. మొత్తం రెండు పేపర్లను కలిపి కేటాయించిన మార్కులు 900. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. పేపర్ 1లో మ్యాథ్స్ 300 మార్కులకు 120 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. పేపర్ 2 లో జనరల్ ఎబిలిటీస్ విభాగానికి చెందింది. దీనికి కేటాయించిన మొత్తం మార్కులు 600. 150 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే లో.. బీటెక్,బిఎస్సి, బిఏ కోర్సులు .. నేషనల్ అకాడమీ ఎజీమలలో బీటెక్ ( నేషనల్ ఆర్కిటెక్చర్)విద్యను అభ్యసించవచ్చు. అన్ని ఉచితంగానే ఉంటాయి. ఇందులో పాస్ అయిన వారికి డిగ్రీ పట్టాలు అందిస్తారు. దీని తర్వాత సంబంధిత విభాగాల ట్రేడ్ శిక్షణకు పంపుతారు. ఒక ఏడాది నుంచి 18 నెలల వరకు శిక్షణ ఉంటుంది. ఈ టైంలో ప్రతినెల 56,100 రూపాయల స్టఫ్ అండ్ , శిక్షణ పూర్తి చేసి వీధుల్లో చేరిన వెంటనే లెవెల్ 10 మూల వేతనాలు 56,100 రూపాయలు చెల్లిస్తారు. అంతేకాకుండా దీనికి అదనంగా మిలిటరీ సర్వీస్ పే 15,500 రూపాయలు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:రూ”100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు అవసరం లేదు.
చివరి తేదీ: జనవరి 10,
పరీక్ష తేదీ :ఏప్రిల్ 16.
వెబ్ సైట్ :http://www.upsc.gov.in