indiramma indlu status
తెలంగాణ ప్రభుత్వం జనవరి 26వ తేదీన ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఒకటి. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాను జనవరి 21 నుంచి జనవరి 24వరకు నిర్వహించిన గ్రామ సభల్లో చదివి వినిపించారు. అయితే ఈ జాబితానే ఫైనలా? లేక మరో జాబితా ఉంటుందా? ఫైనల్ జాబితాలో వచ్చిన పేర్లను ఏవైనా తొలగిస్తారా? వీటిపై అనేక సందేహాలు ప్రజల్లో ఉన్నాయి.
అయితే తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ హౌజింగ్ కార్పొరేషన్ అధికారులు నిర్వహించిన సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్టు పై రివ్యూ నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్టును L1, L2, L3 జాబితాలుగా విభజించారు. వీటిలో ఎల్1 అనగా లబ్దిదారులు ఖాళీ ఇంటి స్థలం ఉండి పూర్తిగా ఇళ్లు లేని వారు, ఎల్2 అనగా ఇండ్లు గానీ ఖాళీ స్థలం గానే లేనివారు, ఎల్3 అనగా పూరిల్లు, రేకులు, శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు కలవారుగా విభజించారు.
గ్రామ సభలో ప్రకటించిన ఫైనల్ లిస్టులోని లబ్దిదారుల్లో ఎల్1 కేటగిరి వారికి మొదటి విడుతగా ఇల్లు నిర్మాణానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారు. ఆ తర్వాత ప్రాధాన్యత వారిగా ఎల్1, ఎల్2, ఎల్3 కేటగిరీలకు ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు చెల్లిస్తారు. దీనిపై మరికొంత క్లారిటీ రావాల్సి ఉంది.