ప్రస్తుత కాలంలో చాలామంది వివాహం చేసుకున్న తర్వాత గర్భం దాల్చడానికి చాలా సమయం పడుతుంది. దీనికి ప్రధాన కారణం వారు తీసుకునే ఫుడ్ మరియు చేసే పనిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కొన్ని కారణాల వల్ల చాలామంది సంతానం కోసం ఇబ్బందులు పడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా అలాంటివారు ఈ కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఈ సమస్యల నుంచి కాస్త ప్రయోజనం చేకూరుతుందని ఒక సర్వేలో తేలింది. దాదాపుగా మన భారతదేశంలో 22 నుంచి 33 మిలియన్ల జంటలు ఈ సమస్య అనుభవిస్తున్నారని తేలింది. మరి దీనికి పరిష్కార మార్గాలు ఏంటో చూద్దాం..
వయస్సు:
ముఖ్యంగా సంతానోత్పత్తిని వయసు అనేది ప్రభావితం చేస్తుంది. సంతానోత్పత్తితో బాధపడే జంటలు గర్భధారణ లేకుండా గరిష్టంగా ఒక ఏడాది కాలం తర్వాత వయసు ఎక్కువ ఉన్న జంటలు ఆరు నెలల తర్వాత చికిత్స తీసుకోవాలి. దీనివల్ల సంతానోత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది.
అధిక ఊబకాయం :
చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారిలో సంతానోత్పత్తి కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇది వారిలో ఉండే హార్మోన్లు అసమతుల్యతను నిరోధించడంలో సహాయపడుతుంది. కాబట్టి స్త్రీలు ఊబకాయం రాకుండా చూసుకోవాలి. దీనివల్ల సంతానం తొందరగా కలుగుతుంది.
వ్యాయామం:
ముఖ్యంగా మితిమీరిన వ్యాయామం కాకుండా మితంగా వ్యాయామం చేయడం వల్ల ఎండార్పిన్లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇది మీరు విశ్రాంతి మరియు బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. కానీ ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల సన్నగా అయ్యి బరువు తగ్గుతారు. ఇది సంతాన ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి మితంగా వ్యాయామం చేస్తూ గర్భాన్ని పొందే అవకాశాలను ఎక్కువగా పొందవచ్చు.
సమతుల్య ఆహారం :
సంతాన ఉత్పత్తితో బాధపడే జంటలు ముఖ్యంగా భావోద్వేగానికి ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఇలాంటి జంటలు ఎక్కువగా పోషకాహారం తీసుకుంటే ఇది మీ సంతాన ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
ఈ అలవాట్లు ఉంటే సంతానం కష్టమే..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?