ఇప్పటికే హిట్ సినిమా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయమందుకుంది.. దీనికి సీక్వెల్ గా వచ్చిన హిట్2 కూడా విజయ తీరాల వైపు దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన వారంతా సూపర్ హిట్ టాక్ అంటూ రివ్యూ ఇస్తున్నారు.. ఈ తరుణంలోనే మరో విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.. అదేంటయ్యా అంటే.. ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేసు లో విశ్వక్సేన్ హీరోగా నటించి సినిమా విజయవంతం అయింది.

దీనికి కొనసాగింపుగానే హిట్ 2 ది సెకండ్ కేసులో అడివి శేష్ హీరోగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నటనతో మెస్మరైజ్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ తరుణంలోనే “హిట్ 3 ” పై భారీగా అంచనాలు పెరిగాయి.. అయితే ఈ చిత్రం విడుదల అవ్వడానికి ముందు HIT3లో కూడా అడివి శేష్ కనిపిస్తారని అందరూ భావించారు.. కానీ హిట్2 సినిమా చూశాక అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. సినిమా క్లైమాక్స్ లో HIT3లో హీరోగా ఎవరు రానున్నారో దర్శకుడు హింట్ ఇచ్చాడని చెప్పవచ్చు.
క్లైమాక్స్ లో ఇచ్చిన హింటు ప్రకారం చూస్తే హిట్ 3లో హీరోగా నాని అర్జున్ సర్కార్ పాత్రలో నటించినున్నారు.. ఆయన ఇప్పటికే జెర్సీ మూవీలో అర్జున్ గా కనిపించిన విషయం మనందరికీ తెలిసిందే.. ప్రస్తుతం నాని దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో రావడానికి కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఏది ఏమైనా హిట్ సినిమాలో హీరోలు మారినా కానీ కథకు మాత్రం సంబంధం ఉంటుంది.. ఈ విధంగా 7 హిట్ లు వస్తాయని సమాచారం అందుతోంది..
HIT విశ్వక్ సేన్, HIT2 శేష్, HIT 3..హీరో ఎవరో తెలుసా..?