కమలహాసన్ ఆ స్టార్ హీరోయిన్ మ్యాటర్ అంత వరకు వెళ్లిందా..హీరోయిన్ ఏమంటుందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు కమలహాసన్. విలక్షణ నటుడిగా తనకు తానే సాటి అని చెప్పవచ్చు.. అలాంటి కమలహాసన్ ముసలి వయసుకు వచ్చినా కానీ కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు తీస్తూ విజయవంతంగా దూసుకుపోతున్నారు. ఆయన సినిమాల్లోనే కాకుండా హీరోయిన్లతో రొమాంటిక్ పాత్రల్లో కూడా తగ్గేదేలే అనుకుంటూ ముందుకు పోతున్నారు. అలాంటి కమలహాసన్ ఆ హీరోయిన్ తో సహజీవనం చేస్తున్నారని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

బాల నటుడిగా గా కెరియర్ ప్రారంభించిన కమలహాసన్ ఏడుపదుల వయసుకు చేరువవుతున్నారు. తాజాగా ఆయన నటించిన విక్రమ్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది… అనుకోని కలెక్షన్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ తరుణంలో కమలహాసన్ గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.. ప్రస్తుతం ఆయన పలు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన నటి పూజా కుమార్ తో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. విశ్వరూపం,విశ్వరూపం 2, ఉత్తమ విలన్ వంటి సినిమాల్లో కలిసి నటించారు.

నటించడమే కాదు రొమాంటిక్ పాత్రల్లో లిప్ లాక్ సీన్స్ లో కూడా అదరగొట్టారు. ఈ తరుణంలోనే వీరి మధ్య ఏదో నడుస్తుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. కమలహాసన్ పూజ కుమార్ సహజీవనం చేస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.. ఈ తరుణంలోనే వీరు దిగిన ఒక ఫోటో వైరల్ గా మారింది.. ఇక దీనిపై స్పందించిన పూజ కుమార్ క్లారిటీ ఇచ్చింది.. కమలహాసన్ తో ఐదు సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్నానని, వారి కుటుంబంతో నాకు మంచి బాండింగ్ ఉందని, ఈ తరుణంలో ఇలాంటి రూమర్స్ రావడం కామనే అంటూ రిప్లై ఇచ్చింది.. ఏది ఏమైనా ఇలాంటి పుకార్లు మాత్రం క్రియేట్ చేయవద్దు అంటూ రిక్వస్ట్ చేసింది పూజ కుమార్.