కేసీఆర్ ట్రాప్ లోకి బిజెపి వచ్చిందా..?

తెలంగాణ సెంటిమెంట్ అనేది కెసిఆర్ ను 2014 మరియు 2019లో అధికారంలోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ సెంటిమెంట్ ను మళ్లీ తీసుకువద్దాము అనుకున్న సమయంలో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న భారతీయ జనతా పార్టీ కాస్త అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు. తెలంగాణ సెంటిమెంట్ అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన కెసిఆర్ సర్కార్ పై విరక్తి చెందిన కొంతమంది బిజెపి వైపు టర్న్ అవుతున్నారు. ఈ దశలోనే కెసిఆర్ రెండు రకాల వ్యూహాలను వేశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేంద్రం తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు కుట్రలు చేస్తోందని అంటున్నారు.

కానీ ఆ ఫలితం ఆశించినంత లేదు. ఈ తరుణంలోనే షర్మిల అరెస్ట్ అవ్వడంతో బిజెపిని ఈ ఇష్యూలోకి లాక్కొచ్చారు. ఇదిగో చూశారా ఇది ఆంధ్ర పార్టీ అంటూ ప్రజలకు చెబుతున్నారు. ఇంతకుముందు చంద్రబాబు జగన్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ తరుణంలోనే గవర్నర్ దగ్గర నుంచి బిజెపి నాయకులు అంతా ఆమెకు మద్దతుగా నిలబడడం జరిగింది. దీంట్లో కేసీఆర్ వ్యూహంలో కొంతవరకు విజయవంతం అయిందని చెప్పవచ్చు. అదిగో చూశారా ఆంధ్ర వాళ్ళని వెంటబెట్టుకొని తెలంగాణ సెంటిమెంటును బలహీన పరుస్తున్నారని బిజెపిని విమర్శలు చేస్తున్నారు.

అంతేకాకుండా మోడీ వదిలిన బాణం షర్మిల అన్నట్టు మాట్లాడుతున్నారు. కొంతవరకు చూసుకుంటే బిజెపి మాట వినే కోణంలో షర్మిలా లేదు, షర్మిలను వెంట పెట్టుకోవాలని బిజెపి కూడా చూడటం లేదని చెప్పవచ్చు. ఒకవేళ షర్మిల బిజెపిలో చేరితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలిగా నియమించే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆంధ్రలో బిజెపి ఎదగాలంటే షర్మిల చాలా ఉపయోగపడుతుంది. ఈ ఇష్యూ ని బట్టి చూస్తే షర్మిల విషయంలో బిజెపి వాళ్లు అతిగా స్పందించడం కాంగ్రెస్ వాళ్లు సైలెంట్ గా ఉండడం వల్ల తెరాస దీన్ని అస్త్రంగా వాడుకుంటుందని చెప్పుకోవచ్చు.

కేసీఆర్ ట్రాప్ లోకి బిజెపి వచ్చిందా..?