ఎన్నో అనుభూతులు, మరెన్నో జ్ఞాపకాలు, ఎన్నో చేదు అనుభవాలు అన్ని కలగలిపిన 2022 కు స్వస్తి చెప్పి కొత్త ఉత్సాహంతో, కొత్త ఆశలతో, సరికొత్త పనులతో 2023లోకి నూతనంగా అడుగుపెట్టాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఈ కొత్త ఏడాది రావడానికి మరి కొన్ని గంటలే మిగిలి ఉంది.. ఈ కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే కలగాలని, అన్ని రంగాల్లో రాణించాలని 2023 ఆనందంగా గడవాలని చాలామంది కోరుకుంటారు. అలా కోరుకోవడమే కాదు మీ స్నేహితులకు, బంధుమిత్రులకు కొత్త ఏడాదికి సంబంధించిన విషెస్ కూడా చెప్పాలని భావించేవారు ఇది తప్పకుండా చూడాల్సిందే..
- ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఈ కొత్త ఏడాదిలో మీ కలలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..!
- ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటూ , చిరునవ్వును చెదరనివ్వకుండా సంతోష సమయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
- ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటూ స్నేహితులందరికీ హ్యాపీ న్యూ ఇయర్..
- నిండు మనసుతో ఈ కొత్త సంవత్సరంలో అందరితో సుఖసంతోషాలను, పొందాలని.. సరికొత్త ఉత్తైజాన్ని సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్..
- చేసిన తప్పులను మరిచిపో..వాటీని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింప చేసుకో.. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..!
Happy new year2023: wishes, for whatapp status in telugu: