rishab pant and dhawan: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రిషబ్ పంత్ ప్రమాదం గురించే మాట్లాడుకుంటున్నారు.. రిషబ్ పంత్ కారు ప్రమాదం మామూలుగా జరగలేదు.. అసలు ఈ ప్రమాదం నుంచి పంత్ ఎలా బయటపడ్డాడో దేవుడికి తెలుసు.. ప్రమాదం జరిగిన ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. డివైడర్ ను ఢీ కొట్టి మూడు పల్టీలు కొట్టిన కారులో నుంచి రిషబ్ పంత్ బయటపడ్డాడు అంటే ఆయనకు భూమిపై నూకలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అలాంటి రిషబ్ పంత్ ను శిఖర్ ధావన్ స్పీడ్ డ్రైవింగ్ విషయంలో ముందే హెచ్చరించారు. ఆయన హెచ్చరికలను ఒకవేళ పాటించి ఉంటే ఈరోజు పంతుకు ఇలా జరిగి ఉండేది కాదేమో.. అవేంటో వివరాలు చూద్దాం..
ఉత్తరాఖండ్ రూర్కి ప్రాంతంలో రిషబ్ కారు ప్రమాదానికి గురైంది. ఢిల్లీ నుంచి వస్తున్న కారు డివైడర్ ని ఢీ కొట్టి 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది. దీంతో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ తరుణంలోని రిషబ్ పంత్ సమయస్ఫూర్తితో ప్రాణాలతో తప్పించుకున్నారు. ఆయనను అక్కడి నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పంతు ఆరోగ్యం నిలకడగానే ఉందని బీసీసీఐ వెల్లడించింది. ఈ తరుణంలోనే తాజాగా వారి పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2019 ఐపీఎల్ ఆడే సమయంలో పంతు, ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన విషయం మనందరికీ తెలుసు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఒక సరదా ఇంటర్వ్యూ జరిగింది.
ఈ క్రమంలో తనకంటే పెద్దవాడైన దావన్ ను పంత్ ఇలా అడిగాడు.. అన్నయ్య ఈ సందర్భంగా మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వగలరా అన్నారు.. దీంతో ధావన్ “స్పీడ్ డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించు “అని అన్నారు. అయితే అప్పుడు చెప్పిన మాటలు పంత్ పాటించి ఉంటే ఈరోజు ఇంతటి ప్రమాదం అయి ఉండేది కాదేమో అని కొంతమంది అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి .
ధావన్ మాట పంత్ విని ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదేమో.. ఈ వీడియో చూడండి..!!