TS TET NOTIFIACTION 2024 HALL TICKETS
టెట్‌పై ఉచిత అవగాహన కార్యక్రమం టీ–శాట్ న్యూస్ ఛానెల్
తెలంగాణ టెట్ అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే టెట్ ఆన్లైన్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మరో రెండు రోజుల్లో హాల్ టికెట్లను కూడా వెబ్సైట్లో అందుబాటులోకి తేనుంది.
అయితే తెలంగాణాలో మొదటి సారి టెట్ పరీక్షను ఆన్లైన్ (కంప్యూటర్ బేస్ట్ టెస్ట్)లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెట్ అధికారిక వెబ్సైట్లో మాక్ టెస్టులు అందుబాటులో ఉంచారు. TS TET GRAND TEST-2: టీఎస్ టెట్ గ్రాండ్ టెస్ట్–2 (తెలుగు కంటెంట్&గ్రామర్) టెట్ ఆన్లైన్ టెస్టులను ఉచితంగా రాయవచ్చు.

టెట్ అభ్యర్థుల కోసం మరో గుడ్‌న్యూస్… ఈరోజు అనగా మే 15 నుంచి టీ–శాట్ టెట్‌కు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. ఇందుకోసం ఉదయం 11 గంటల నుంచి 12గంటల వరకు నిపుణ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించనుంది. ఇదే కార్యక్రమం మరుసటి రోజు సాయంత్రం 5గంటల నుంచి 6వరకు తిరిగి ప్రసారం చేస్తారు.
లైవ్ ప్రసారం కోసం కింది లింక్ క్లిక్ చేయండి.
నిపుణులైన అధ్యాపకులు టెట్ పరీక్షపై నాలుగు రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో సబ్జెక్ట్ చొప్పున సలహాలు, సూచనలు అందజేస్తారు. ఇవి టెట్ పరీక్ష రాసేందుకు ఎంతగానో తోడ్పడతాయని టీ–శాట్ సీఈవో వేణుగోపాల్ తెలిపారు. టెట్ పరీక్ష ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 040–3540326/726 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
GOOD NEWS FOR TS TET CANDIDATES: టీఎస్ టెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..