GOOD NEWS FOR TET CANDIDATES
తెలంగాణ టెట్–2024 ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు రేవంత్ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. రాబోయే టెట్ మరియు తాజా డీఎస్సీ పరీక్షకు ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఎలా అప్లై చేయాలంటే..

తెలంగాణ ప్రభుత్వం బీఈడీ, డీఈడీ అభ్యర్థులకు గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ టెట్–2024 ఫలితాలు కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా టెట్ ఫలితాల్లో అర్హత సాధించిన వారికి బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తెలంగాణాలో మరోసారి నిర్వహించే టెట్ పరీక్షకు, మరియు డీఎస్సీ పరీక్షలకు ఉచితంగా అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
టెట్ 2024 నోటిఫికేషన్లో దరఖాస్తు ఫీజు రూ.1000, డీఎస్సీ దరఖాస్తు ఫీజు కూడా రూ. 1000 నిర్ణయించారు. ఇప్పటికే డీఎస్సీకి 2.5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇకముందు నుంచి ఈ పరీక్షలకు అప్లై చేసే అభ్యర్థులు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని ఇది ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
టెట్–2024 ఫలితాల్లో మొత్తం 150 మార్కులకు గాను బీసీలకు 75 మార్కులు, ఓసీలకు 90 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 60 మార్కులు సాధిస్తే.. అర్హతగా పరిగణిస్తారు. వీరందరూ కూడా ఉచిత దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు.
GOOD NEWS FOR TET CANDIDATES: టెట్ పాసైన అభ్యర్థులు రేవంత్ సర్కారు గుడ్న్యూస్