ప్రతి సంవత్సరం కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల సహాయాలను అందిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు లవ్ మ్యారేజ్ చేసుకున్న వారికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుందనే విషయం చాలామందికి తెలుసు. కానీ సరికొత్తగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెళ్లైన జంటలకు 2.50 లక్షలు రూపాయలను ఈ పథకం ద్వారా అందిస్తోంది.. ఇంతకీ ఆ పథకం ఏంటి .. దాన్ని ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి .. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..ఈ పథకానికి అర్హులైన వ్యక్తులు మీ నియోజకవర్గ ఎంపీ లేదా ఎమ్మెల్యేకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు ముందుగా డాక్టర్.. అంబేద్కర్ ఫౌండేషన్ కార్యాలయానికి వెళ్తుంది. అయితే ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేయడానికి అర్హులు :
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే నూతన దంపతులు ఒకే కులానికి చెందిన వారై ఉండకూడదు. ముఖ్యంగా అబ్బాయి ఒక కులం అమ్మాయి మరో కులం అయి ఉండాలి. వీరి వివాహం హిందూ వివాహ చట్టం 1995 కింద నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా మీకు మొదటిసారి వివాహమై ఉండాలి. రెండో వివాహం అయితే పథకం వర్తించదు. అలాగే మీరు ఇప్పటివరకు ఏదైనా ప్రభుత్వ నుంచి పథకాన్ని పొందారా అనేది కూడా వీరు గమనిస్తారు. మీరు ఎప్పుడైనా ఏదైనా స్కీం కింద పదివేల రూపాయలు ప్రభుత్వం నుంచి పొందినట్లయితే మీకు ఇచ్చే పథకం నుంచి 10000 రూపాయలు తగ్గించి ఇస్తారు. అంటే 2,50,000 నుంచి 10000 తగ్గించి 2,40,000 ఇస్తారన్నమాట.
దరఖాస్తు విధానం:
-వివాహ ధ్రువీకరణ పత్రం .
- పెళ్లయిన జంట కుల ధ్రువీకరణ పత్రాలు
- వివాహం జరిగినట్లు తెలిపే అఫిడవిట్.
-అలాగే మీ పెళ్లి ఫోటో మొదటి పెళ్లి అని నిరూపించుకోవాలి. - అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు.
- జాయింట్ బ్యాంకు ఖాతా .. ఇందులోనే డబ్బు బదిలీ చేయబడుతుంది.
- దరఖాస్తుల సమర్పించిన తర్వాత అది ధ్రువీకరణ చేయబడుతుంది. అలా కొన్ని రోజుల తర్వాత వీరి జాయింట్ అకౌంట్ లో 1.50 రూపాయలు జమ చేయబడతాయి. మిగిలిన అమౌంట్ ఎఫ్డిగా ఇవ్వబడుతుంది .